Friday, February 10, 2012

మా ఊరు ఒక్క సారి పొయి రావాలి.

మా ఊరు ఒక్క సారి పొయి రావాలి.

( పాలగుమ్మి విశ్వనాథం గారు రచించి, స్వరపరచి గానం చేసిన పాట ఇది..)

పంట చేల గట్ల మీద నడవాలి..

ఊహలకు రెక్కలొచ్చి ఎగరాలి..

పంట చేల గట్ల మీద నడవాలి..

ఊహలకు రెక్కలొచ్చి ఎగరాలి..

మా ఊరు ఒక్క సారి పొయి రావాలి.

జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి...

మా ఊరు ఒక్క సారి పొయి రావాలి.

జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి...

వయ్యారి నడకలతో సెలయేరు..

ఏరు దాటితేనె మా ఊరూ..

ఊరి మధ్య కోవెల కోనేరూ..

ఒక్కసారి చూస్తిరా .. తిరిగి రాలేరూ..

మా ఊరు ఒక్క సారి పొయి రావాలి.

జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి...

అమ్మానాన్నలను కలవాలి..

ప్రేమానురాగాలు పంచుకోవాలి..

అమ్మ చేతి వంటనే ఆరగించాలి..

అమ్మ వొడి లోన ఆదమరచీ .. నిదుర పోవాలి..

మా ఊరు ఒక్క సారి పొయి రావాలి.

జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి...

చిన్ననాటి స్నేహాలు చుట్టు చేరాలి..

మనసు విప్పి మాట్లాడే మనుషుల కలవాలి..

ఒకరికొకరు ఆప్యాయత ఒలకబోయాలి..

ఆగలేక నా కన్నులు .. చెమ్మగిల్లాలి..

మా ఊరు ఒక్క సారి పొయి రావాలి.

జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి...

****బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బంగారు బతుకమ్మ ఉయ్యాలో..

మనగౌరి గౌరమ్మ ఉయ్యాలో..

మా వూరి వెలుగంట ఉయ్యాలో..***

మా వూరి పక్కనే చెరువుందీ..

ఆ చెరువు గట్టు మీద రెండు చెట్లున్నాయి..

చెట్ల కింద బతుకమ్మలాట చూడాలి..

పక్కనున్న పైరు చూసీ .. పరవశించాలి ..

మా ఊరు ఒక్క సారి పొయి రావాలి.

జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి...

గోవుల్ని కాసేటి బోయిల్లoదంబు..

ఆ బోయిల్లు పాడేటి పాటలందంబు..

సందె వేల చప్పట్లకోలాటలందంబు..

ఆడుతూ ఊగే .. బొంగు టుయ్యాలందంబు..

మా ఊరు ఒక్క సారి పొయి రావాలి.

జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి...

మా ఊరు ఒక్క సారి చూసి రావాలి..

జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి...

No comments:

Post a Comment